తెలంగాణలో పేద పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో 25% సీట్లు.. ఉచిత విద్యపై కీలక అప్‌డేట్!
తెలంగాణలో పేద, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించే దిశగా మరోసారి కదలిక మొదలైంది. విద్యాహక్కు చట్టం (RTE) ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశ స్థాయి సీట్లలో 25 శాతం అర్హులైన పిల్లలకు కేటాయించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఈ నిబంధన అమలు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో తాజాగా సుప్రీంకోర్టు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (NCPCR) దృష్టి సారించాయి. విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది? విద్యాహక్కు చట్టం-2009లోని…