రైలులో మొబైల్లో రీల్స్ చూస్తున్నారా? రూ.1,000 జరిమానా పడొచ్చు.. రైల్వేల కీలక ఆదేశాలు!
రైలు ప్రయాణంలో మొబైల్లో సినిమాలు, వీడియోలు, సోషల్ మీడియా రీల్స్ చూడటం చాలామందికి అలవాటు. అయితే ఫోన్లో వీడియోలు చూస్తున్నప్పుడు స్పీకర్ ద్వారా పెద్ద శబ్దంతో ఆడియో వినిపిస్తూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు దక్షిణ రైల్వే కీలక ఆదేశాలు జారీ చేసింది. రైలులో లేదా రైల్వే ప్రాంగణంలో పెద్ద శబ్దంతో వీడియోలు, పాటలు ప్లే చేయడం, గట్టిగా ఫోన్లో మాట్లాడటం వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే రూ.1,000…